News August 28, 2024

VZM: హాట్ టాపిక్‌గా ఈవీఎంల వ్యవహారం

image

జిల్లాలో EVMల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బ్యాటరీ స్టేటస్, వీవీ ప్యాట్లను ఓట్లతో సరిపోల్చాలని, సీసీ ఫుటేజీ ఇవ్వాలని మాజీ MP బెల్లాన చంద్రశేఖర్, మాజీ MLA అప్పలనరసయ్య ఈసీకి ఫిర్యాదు చేయగా.. నెల్లిమర్ల గోదాములో తనిఖీలు ప్రారంభించారు. కొత్త ఈవీఎంతో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెప్పగా అందుకు బెల్లాన నిరాకరించారు. ఫిర్యాదుకు, అధికారుల తనిఖీకు అసలు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 10, 2024

పుష్పాలంకరణలో శ్రీ పైడితల్లి అమ్మవారు

image

విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లమ్మకు చదురుగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో ఆలయ అర్చకులు వేకువజాము నుంచి పంచామృతాభిషేకాలు, పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

News September 10, 2024

బొబ్బిలి : నెలరోజులకే రూ.94లక్షలు గంగార్పణం

image

పారాది వద్ద వేగావతి నదిపై రూ.94 లక్షలు వెచ్చించి నిర్మించిన కాజ్వే నెల రోజులుకే గంగ పాలైంది. ఇప్పటికే నాలుగుసార్లు మరమ్మతులు చేశారు. ఈసారి వర్షాలకు ఐదు రోజులుగా నీరు పారడంతో సగం వరకు పాడైపోయింది. పూర్తిస్థాయిలో మరమ్మ తులు చేస్తే కానీ వాహనాల రాకపోకలకు వీలు ఉండదని అధికారులు అంటున్నారు. నీరు పూర్తిగా తగ్గిన తర్వాతే మరమ్మతులు చేస్తామని ఏఈ రాజు తెలిపారు.

News September 10, 2024

పెరిగిన తోటపల్లి నీటి మట్టం

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 3,710 క్యూసెక్కులగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తివేసి 2,777 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాల్వల ద్వారా 190 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 2.5 టీఎంసీలకు కాగా.. ప్రస్తుతం 1.858 టీఎంసీలు ఉందన్నారు.