News January 5, 2025
VZM: హైందవ శంఖారావానికి తరలి వెళ్లిన ఉమ్మడి జిల్లా వాసులు

విజయవాడలోని కేసరపల్లిలో హైందవ శంఖారావం నినాదంతో భారీ బహిరంగ సభ ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు భక్తులు, హిందూ సంఘాల సభ్యులు విజయవాడకు శనివారం పయనమయ్యారు. విజయనగరం, పార్వతీపురం జిల్లా కేంద్రాల నుంచి ప్రైవేట్ బస్సుల్లో తరలి వెళ్తున్నారు. మరి కొంతమంది ట్రైన్లను ఆశ్రయించారు.
Similar News
News November 8, 2025
VZM: ఈనెల 12న YSRCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టామని ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. గత 17 నెలల్లో ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, మెడికల్ కాలేజీకి మాత్రం నిధులు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు.
News November 8, 2025
యాక్సిడెంట్.. ఇద్దరికి గాయాలు

విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జమ్ము నారాయణపురం గ్రామం వద్ద ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా బైక్ నుజ్జునుజ్జు అయింది. గాయపడిన ఇద్దరిని 108లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు విజయనగరంలోని దాసన్నపేటకు చెందిన వారని స్థానికులు తెలిపారు.
News November 8, 2025
వసతి గృహంలో విద్యార్థులతో కలిసి ఎంపీ కలిశెట్టి రాత్రి బస

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన పుట్టిన రోజును శుక్రవారం పూసపాటిరేగ మండలం కొప్పెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేసిన ఎంపీ.. రాత్రి కూడా అక్కడే విద్యార్థుల మధ్య బస చేశారు. తన జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతృప్తినిచ్చిందని ఎంపీ పేర్కొన్నారు.


