News June 7, 2024
VZM: అప్పుడు 7 వేలు ఓట్లు.. ఇప్పుడు 1,09,915

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన లోకం నాగ మాధవి కేవలం 7వేల ఓట్లకే పరిమితమయ్యారు. 2024లో టిక్కెట్ దక్కించుకున్న ఆమె.. తన చరిష్మాతో నియోజకవర్గమంతా తిరిగి ప్రజాభిమానాన్ని సంపాదించారు. ముఖ్యంగా పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి యువతను తన వైపు ఆకర్షించారు. ఫలితంగా 1,09,915 ఓట్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్నారు.
Similar News
News November 9, 2025
విశాఖలో విజయనగరం జిల్లా వాసి మృతి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి విశాఖలోని మల్కాపురంలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. అక్కడే ఓ బార్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యం బారిన పడిన గణపతి శనివారం అర్ధరాత్రి బార్ వద్దే ఆకస్మికంగా మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
News November 8, 2025
VZM: ఈనెల 12న YSRCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టామని ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. గత 17 నెలల్లో ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, మెడికల్ కాలేజీకి మాత్రం నిధులు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు.
News November 8, 2025
యాక్సిడెంట్.. ఇద్దరికి గాయాలు

విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జమ్ము నారాయణపురం గ్రామం వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా బైక్ నుజ్జునుజ్జు అయింది. గాయపడిన ఇద్దరిని 108లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు విజయనగరంలోని దాసన్నపేటకు చెందిన వారని స్థానికులు తెలిపారు.


