News April 25, 2024

VZM: ఇంటర్ ఫెయిల్ అయిన వారికి స్పెషల్ క్లాసులు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అంబేడ్క‌ర్ గురుకులాల్లో ఇంటర్ తప్పిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త టి.పద్మజ తెలిపారు. 13 గురుకులాల్లోని ఫస్ట్ ఇయర్, సెకెండియర్ కలిపి 172 మంది ఫెయిలయ్యారని వెల్లడించారు. ఈనెల 24న తరగతులు ప్రారంభించగా.. మే 23 వరకు కొనసాగుతాయన్నారు. బాలురుకు కొప్పెర్లలో, బాలికలకు నెల్లిమర్ల గురుకులంలో వేర్వేరుగా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Similar News

News November 29, 2024

మీ ప్రాంతంలో ధాన్యం సేకరణ ఎలా ఉంది?

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరి నూర్పులు పూర్తి కాగా పండించిన పంటను ధాన్యం కోనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాలను 250 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. మరి మీ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు సేకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News November 29, 2024

విజయనగరం జిల్లాలో విషాదం

image

ఎస్.కోట మండలంలో 2 వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.కోటకు చెందిన విశాలక్ష్మి (86) బుధవారం వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖ తరలించగా అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందారు. అదేవిధంగా వెంకటరమణ పేట గ్రామానికి చెందిన సన్నమ్మ మెట్ల నుంచి జారిపడగా మెరుగైన చికిత్స కోసం KGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.

News November 29, 2024

గంజాయి రవాణాపై 289 కేసులు: DIG

image

గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.