News August 12, 2024
VZM: ఇద్దరు బాలికల కిడ్నాప్..UPDATE

విజయనగరం వాసి ఎం.వెంకటేశ్ 15 రోజులు కిందట తూ.గో జిల్లాకు చెందిన ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. బాలికలను కాకినాడలోని హాస్టల్‌లో వదులుతానని తీసుకుపోయినట్లు వారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరం సీఐ గణేశ్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. వారు నెల్లూరులో ఉన్నట్లు గుర్తించి నిందితుడికి అదుపులోకి తీసుకున్నట్లు సమచారం.
Similar News
News December 29, 2025
VZM: రెవెన్యూ క్లినిక్‌లకు 23 దరఖాస్తులు

జిల్లాలో సోమవారం ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్ లకు 23 దరఖాస్తులు అందాయి. అందులో విజయనగరం డివిజన్‌కు 15, బొబ్బిలి డివిజన్‌కు 5, చీపురుపల్లి డివిజన్‌కు 3 దరఖాస్తులు అందాయి. వివిధ భూ సమస్యల పరిష్కార నిమిత్తం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారని ఆయా డివిజనల్ అధికారులు పేర్కొన్నారు. విజయనగరంలో ఆర్డీఓ కీర్తి ధరఖాస్తులు స్వీకరించారు.
News December 29, 2025
వారం రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు: SP

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ దామోదర్ ప్రజల నుంచి 19 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో భూ వివాదాలు 8, కుటుంబ కలహాలు 3, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలపై 7 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వాస్తవాలను పరిశీలించి, 7 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News December 29, 2025
విజయనగరం కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అర్జీదారులు పోటెత్తారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 232 వినతులు స్వీకరించారు. వచ్చిన వినతులను వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి వారం పీజీఆర్ఎస్‌పై సమీక్షిస్తామన్నారు.


