News October 9, 2025

VZM: ఈనెల 10, 11న ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్-కమ్-సేల్

image

ఈనెల 10, 11న మహారాజా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రాంగణంలో ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్-కమ్-సేల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. వివిధ ఎలక్ట్రానిక్స్ డీలర్లు తమ తాజా గాడ్జెట్లు, గృహోపకరణాలు, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్, హెల్త్ డివైసెస్ ప్రదర్శనకు ఉంచనున్నారన్నారు. తగ్గిన పన్ను రేట్ల ప్రకారం తక్కువ ధరకే ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు.

Similar News

News October 9, 2025

సానుకూల దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించాలి: DRO

image

అర్జీదారుల సమస్యలను సానుకూల దృష్టితో పరిష్కరించాలని DRO శ్రీనివాసమూర్తి సూచించారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. పెండింగ్ మ్యుటేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కాని సందర్భాల్లో నిబంధనలను వివరించి, నోటీసుపై సంతకం తీసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు అర్జీదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

News October 9, 2025

బాణాది చెరువులో పడి వ్యక్తి మృతి

image

వేపాడ మండలం బాణాదిలో సంపర్తి ఆంజనేయులు (32) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్సై సుదర్శన్ వివరాల మేరకు.. అతను గ్రామానికి దగ్గరలో ఉన్న తమ్మ చెరువుకు దుస్తులు ఉతకడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 9, 2025

4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం: కలెక్టర్

image

ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. మండల, గ్రామ స్థాయి కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. RSK సిబ్బందికి మద్దతు ధర, ట్రక్ షీట్ విధానంపై శిక్షణలు పూర్తి చేయాలన్నారు.