News December 13, 2025
VZM: ఉమ్మడి జిల్లాలో 9,513 కేసుల పరిష్కారం

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మొత్తం 9,513 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్‌లో సివిల్ 424, క్రిమినల్ 9,028, ప్రీ-లిటిగేషన్ 61 కేసులు పరిష్కారమయ్యాయని సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తెలిపారు. మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్‌కు రూ.90 లక్షల పరిహారం అందజేశారు.
Similar News
News December 17, 2025
అలిపిరి వద్ద అపచారం.. TTD చర్యలు

అలిపిరి సమీపంలోని TTD భూదేవి కాంప్లెక్స్‌లో మద్యం సీసాలు, మాంసం లభ్యమవడం కలకలం రేపింది. దర్శన టికెట్లు జారీ చేసే ప్రాంతంలోనే ఇవి గుర్తించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. TTD విజిలెన్స్ నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన TTD అధికారులు.. భూదేవి కాంప్లెక్స్‌లో విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
News December 17, 2025
బర్త్‌డే విషెస్.. CBN, పవన్‌కు షర్మిల థాంక్స్

AP: పీసీసీ చీఫ్ షర్మిలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ Xలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని వారు ఆకాంక్షించారు. వారికి ధన్యవాదాలు చెబుతూ పీసీసీ చీఫ్ రిప్లై ఇచ్చారు. అటు వైసీపీ చీఫ్ జగన్ షర్మిలకు విషెస్ చెప్పకపోవడం గమనార్హం.
News December 17, 2025
నిలిపివేసిన రైళ్లను పునరుద్ధరించండి: పురందీశ్వరి

RJY, కొవ్వూరు రైల్వే స్టేషన్లలో గతంలో నిలిపిన రైళ్లను పునఃప్రారంభించాలని రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి కోరారు. బుధవారం పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కోవిడ్ అనంతరం రద్దయిన రైలు హాల్టింగ్‌లను పునరుద్ధరించాలని, రానున్న పుష్కరాల దృష్ట్యా భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు.


