News September 10, 2025

VZM: ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో వీడియో కాన్ఫెరెన్స్

image

విజయనగరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి బబిత ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వచ్చేనెల 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను న్యాయవాదులు విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు, అన్ని సివిల్ దావాలు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు, తదితర కేసులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.

Similar News

News September 11, 2025

VZM: నేడు రాష్ట్రానికి చేరుకోనున్న యాత్రికులు

image

నేపాల్‌లో గడిచిన 2 రోజులగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా నుంచి మొత్తం 61 మంది మానససరోవర యాత్రకు వెళ్లిన వారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఖాట్మండు నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు యాత్రికులందరూ రాష్ట్రానికి చేరుకుంటారన్నారు. వారి బంధువులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కోరారు.

News September 11, 2025

VZM: డయల్ యువర్ కలెక్టర్ వాయిదా

image

రైతుల‌కు త‌గినంత యూరియా జిల్లాలో అందుబాటులో ఉంద‌ని, పంపిణీ కూడా స‌క్ర‌మంగా జ‌రుగుతోంద‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ బుధవారం తెలిపారు. యూరియా స‌ర‌ఫ‌రాలో స‌మ‌స్య‌లు త‌గ్గాయ‌ని, డ‌యిల్ యువ‌ర్ క‌లెక్ట‌ర్ కార్య‌క్ర‌మానికి ఫోన్ చేసేవారి సంఖ్య కూడా త‌గ్గింద‌ని చెప్పారు. అందువ‌ల్ల డ‌యిల్ యువ‌ర్ క‌లెక్ట‌ర్‌ కార్య‌క్ర‌మాన్ని గురువారం నుంచి తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News September 10, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

విజయనగరం మండలం రీమా పేట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీ.టీ.అగ్రహారానికి చెందిన సిమ్మ రాము(50) మృతి చెందాడు. మృతుడు బండిపై ఐస్‌లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. బుధవారం ఐస్‌లు అమ్ముకుని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై రూరల్ ఎస్‌ఐ వి.అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.