News September 11, 2025
VZM: ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో వీడియో కాన్ఫెరెన్స్

విజయనగరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి బబిత ఉమ్మడి జిల్లా న్యాయవాదులతో బుధవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. వచ్చేనెల 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను న్యాయవాదులు విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు, అన్ని సివిల్ దావాలు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు, తదితర కేసులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.
Similar News
News September 11, 2025
లిక్కర్ స్కాం కేసులో సిట్ సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. హైదరాబాద్, విశాఖలో నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లోని స్నేహ హౌస్, రోడ్ నంబర్-2లోని సాగర్ సొసైటీ, కాటేదాన్-రాజేంద్రనగర్, ఖైరతాబాద్-కమలాపురి కాలనీలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని వాల్తేర్ రోడ్-వెస్ట్ వింగ్‌లో ఉన్న మరో కార్యాలయంలోనూ రైడ్ జరుగుతోంది.
News September 11, 2025
ఏలూరు: పాము కాటుకు గురై ఒకరు మృతి

లింగపాలెం మండలం వేములపల్లి గ్రామానికి చెందిన ఏసుపాదం (48) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం గ్రామంలో పామాయిల్ తోటలో గెలలు కోస్తున్న సమయంలో పాముకాటుకు గురయ్యాడు. ఇది గమనించిన తోటి కూలీలు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతని మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 11, 2025
నెల్లూరు: ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 5.58 లక్షలు స్వాహా

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 5.58 లక్షలు స్వాహ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నెల్లూరులోని చిన్నబజార్ పోలీసులుకు ఫిర్యాదు అందింది. ఉద్యోగ వేటలో ఉన్న మూలపేటకు చెందిన ఓ యువకుడు ఫోన్లో పరిచయమైన ఓ యువతి చెప్పిన మాటలకు లోబడి ఆమె ఖాతాకు రూ.5.58 లక్షలను బదిలీ చేశాడు. తర్వాత ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.