News March 12, 2025

VZM: ఉల్లాస్ కార్యక్రమం.. 3 గంటల పాటు పరీక్ష

image

విజయనగరం జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదైన నిరక్షరాస్యులైన వయోజనులకు 3 గంటల పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బీఆర్‌ అంబేడ్కర్ తెలిపారు. ఈ పరీక్ష 23న ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుందని, ఈ మధ్యలో ఏ 3 గంటలైనా అభ్యర్థులు పరీక్షను రాయవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సుమారు 48 వేల మంది ఈ పరీక్ష రాయనున్నారని, 875 పాఠశాలలను గుర్తించి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 12, 2025

వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో కాంస్యంతో మెరిసిన లలిత

image

విజయనగరం ఉడా కాలనీకి చెందిన క్రీడాకారిణి కిల్లకి లలిత వరల్డ్ పారా అథెటిక్స్‌లో మెరిసింది. న్యూఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో తొలిరోజు టీ-11 విభాగం 1,500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. లలిత జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ ప్రతినిధులు, తోటి క్రీడాకారులు అభినందించారు.

News March 11, 2025

VZM: పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం..

image

విజయనగరం జిల్లాలో ఓ తల్లి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన వంగర మండలంలో మంగళవారం జరిగింది. కింజంగి గ్రామానికి చెందిన కళింగ శ్రావణి (30), కుమారుడు సిద్దు (9), కుమార్తె సైని (6)తో కలిసి మడ్డువలస కుడి కాలువలోకి దూకింది. ఇది గమనించిన స్థానికులు తల్లి, కుమారుడిని కాపాడారు. కుమార్తె గల్లంతైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 11, 2025

VZM: ఇంటర్ పరీక్షకు 1,012 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఫిజిక్స్, ఎకనామిక్స్, ఒకేషనల్ విద్యార్థులు 1,012 మంది గైర్హాజరు అయ్యారని ఆర్‌ఐఓ ఎం.ఆదినారాయణ తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 22,398 మంది హాజరు కావాల్సి ఉండగా వారిలో 21,386 మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

error: Content is protected !!