News December 19, 2025
VZM: ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్

ఉమ్మడి విజయనగరం జిల్లాకు కానిస్టేబుళ్లుగా ఎంపికైన 133 మంది పురుష, మహిళా అభ్యర్థులు ఈనెల 20న ఉదయం 8 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద శిక్షణ నిమిత్తం హాజరుకావాలని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈనెల 22 నుంచి 9 నెలల శిక్షణ ప్రారంభం కానుండగా.. పురుషులను డీటీసీ చిత్తూరు, మహిళలను పీటీసీ ఒంగోలుకు పంపిస్తామన్నారు. అవసరమైన పత్రాలు, రూ.10,000 కాషన్ డిపాజిట్, లగేజీతో రావాలని, బంధువులకు అనుమతి లేదన్నారు.
Similar News
News December 19, 2025
ఏలూరు: టెట్ పరీక్షకు 38 మంది గైర్హాజరు

ఏలూరు జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) శుక్రవారం ప్రశాంతంగా ముగిసిందని డీఈఓ వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఉదయం సెషన్‌కు 175 మందికి గానూ 148 మంది (27 మంది గైర్హాజరు), మధ్యాహ్నం సెషన్‌కు 175 మందికి గానూ 164 మంది హాజరు, (11 మంది గైర్హాజరు) అయినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాకుండా పకడ్బందీగా నిర్వహించామని ఆమె స్పష్టం చేశారు.
News December 19, 2025
అందరి సహకారంతోనే ఎన్నికలు ప్రశాంతం: ఎస్పీ జానకి

జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికల్లో ప్రజల సహకారం, వివిధ శాఖల అధికారుల సమన్వయం, పోలీస్ విభాగం కర్తవ్యనిష్ఠతో చేసిన సేవలే ఈ ఎన్నికల విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. మూడు విడతల్లో 900 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించాలని తెలిపారు.
News December 19, 2025
సూర్యాపేట జిల్లాలో దరఖాస్తులకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద విదేశీ ఉన్నత విద్యకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పీజీ, డాక్టర్ల చదువుల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎల్.శ్రీనివాస్ తెలిపారు. ఎంపికైన వారికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. 2026 జనవరి 19 దరఖాస్తుల గడువు చివరి తేదీ.


