News May 10, 2024

VZM: ‘ఎంసీసీ నిఘా బృందాలు చురుకుగా పని చేయాలి’

image

 ఎంసీసీ నిఘా బృందాలైన ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీలు, ఎక్స్పెండిచర్ బృందాలు వాహనాల తనిఖీలలో, నగదు, మద్యం, వస్తువుల పంపిణీలపై దృష్టి పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. రానున్న మూడు రోజుల్లో చురుకుగా పని చేయాలన్నారు. ఎంసీసీ బృందాలు పక్షపాత రహితంగా పని చేయాలనీ సూచించారు. గురువారం కలెక్టర్ నాగలక్ష్మి వెబెక్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.

Similar News

News April 22, 2025

VZM: డోనర్ అవసరం లేదు.. నేరుగా రండి..!

image

తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్ర‌స్తులు రెడ్‌క్రాస్ బ్ల‌డ్ బ్యాంకు నుంచి ఉచితంగా ర‌క్తాన్ని పొంద‌చ్చని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మ‌న్ ప్ర‌సాద‌రావు సోమవారం తెలిపారు. ర‌క్తం అవ‌స‌ర‌మైతే కంటోన్మెంట్ స‌మీపంలోని రెడ్ క్రాస్ బ్ల‌డ్ బ్యాంకును సంప్ర‌దించి అవ‌స‌ర‌మైన గ్రూపు ర‌క్తాన్ని పొంద‌వ‌చ్చన్నారు. డోన‌ర్ అవ‌స‌రం లేద‌ని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదన్నారు.

News April 22, 2025

VZM: మంత్రి నిమ్మల జిల్లా పర్యటన షెడ్యూల్ ఇలా

image

జ‌ల‌వ‌న‌రుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు విజయనగరం జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. ఉద‌యం 4.30 గంట‌ల‌కు మంత్రి జిల్లాకు చేరుకుంటారు. ఉద‌యం 8.30 గంట‌ల‌కు గుర్ల మండ‌లంలో తార‌క‌రామ తీర్ధ‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ బ్యారేజ్‌ ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. అక్క‌డి నుంచి 9.30కు బ‌య‌లుదేరి, కుమిలి వ‌ద్ద నిర్మాణంలో ఉన్న రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. అనంతరం క‌ల‌క్ట‌రేట్‌కు చేరుకొని సమీక్షిస్తారు.

News April 21, 2025

డీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఆనందం: కిమిడి

image

కూటమి ప్రభుత్వం DSC ప్రకటన విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఎనలేని ఆనందం వ్యక్తం అవుతుందని TDP జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలోని తన నివాసంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,346 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు.

error: Content is protected !!