News September 9, 2025
VZM: ‘ఎరువులు అక్రమ నిల్వలు చేస్తే చర్యలు తప్పవు’

ఎరువులు అక్రమ నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంబేడ్కర్ హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 11 మంది రైతులు కలెక్టర్‌తో మాట్లాడారు. జిల్లాలో 400 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రానున్న 3 రోజుల్లో ఓ కంపెనీ ద్వారా 1,000 మెట్రిక్ టన్నులు, కోరమాండల్ కంపెనీ ద్వారా 1000 మెట్రిక్ టన్నులు వస్తాయన్నారు. వీటిని 25వ తేదీ లోపు అందజేస్తామన్నారు.
Similar News
News September 9, 2025
మాదకద్రవ్యాల నియంత్రణకు విస్తృత ప్రచారం: VZM ఎస్పీ

మాదక ద్రవ్యాల నియంత్రణకు సంకల్పం ప్రచార రథం ద్వారా విజయనగరం జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తెలిపారు. క్షేత్ర స్ధాయిలో ‘సంకల్ప రథం’తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువతతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న వ్యక్తులు, ప్రజలకు ‘సంకల్పం’ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.
News September 9, 2025
ఎస్.కోట: ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

ఎస్.కోటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ స్థానిక వన్ వే రోడ్డుపై నడిచి వెళుతున్న వల్లయ్యను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News September 9, 2025
విజయనగరంలో డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విజయనగరం ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలు, ఇబ్బందులను 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.