News September 6, 2025

VZM: ఎరువుల స‌ర‌ఫ‌రాపై రేపు డ‌యిల్ యువ‌ర్ క‌లెక్ట‌ర్‌

image

ఎరువుల స‌ర‌ఫ‌రాపై రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు, వారి నుంచి సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను స్వీక‌రించేందుకు ఆదివారం డ‌యిల్ యువ‌ర్ క‌లెక్ట‌ర్‌ కార్య‌క్ర‌మాన్ని అంబేడ్కర్ ఏర్పాటు చేశారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌లు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మ‌ధ్య 9441957315 నంబ‌రుకు ఫోన్ చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

Similar News

News September 7, 2025

దావోస్ పర్యటనలో మంత్రి కొండపల్లి బిజీ బిజీ

image

దావోస్ పర్యటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిజీ బిజీగా గడుపుతున్నారు. SME రంగం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఎటువంటి ప్రోత్సాహకాలు అవసరం అనే అంశంపై గ్లోబల్ SME సమ్మిట్ -2025లో శనివారం ప్రసంగించారు. SMEల అభివృద్ధికి నూతన టెక్నాలజీతో పాటు, యూనివర్శిటీల నుంచే స్టార్టప్‌లను ప్రోత్సహించడం, పరిశోధన-అభివృద్ధి విభాగాల్లో వాటిని మరింత బలోపేతం చేయడం, తదితర అంశాలపై చర్చించారు.

News September 6, 2025

VZM: యూరియా పంపిణీపై కలెక్టర్ కీలక ప్రకటన

image

ప్ర‌స్తుతం విజయనగరం జిల్లాలో 1,122 మెట్రిక్ ట‌న్నుల యూరియా RSK, ప్ర‌యివేటు వ‌ర్త‌కుల వ‌ద్దా సిద్ధంగా ఉంద‌ని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం తెలిపారు. సోమ‌వారం మ‌రో 850 ట‌న్నులు, గురువారం 1,000 ట‌న్నులు యూరియా జిల్లాకు రానుంద‌ని పేర్కొన్నారు. ఇది కాకుండా ఈ నెలాఖ‌రుకి మ‌రో 3,000 మెట్రిక్ ట‌న్నుల యూరియా వ‌స్తుంద‌ని వెల్లడించారు. రైతులు షాపులవ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి క్యూల్లో నిల్చోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

News September 6, 2025

VZM: ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ల ప‌రీక్ష కోసం కంట్రోల్ రూమ్‌

image

విజయనగరం జిల్లాలో ఏపీపీఎస్‌సీ ఆధ్వ‌ర్యంలో ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫారెస్టు బీట్ ఆఫీస‌ర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీస‌ర్లు, సెక్ష‌న్ ఆఫీస‌ర్ల ప‌రీక్ష కోసం అభ్య‌ర్థుల‌కు స‌హాయం అందించేందుకు క‌లెక్ట‌రేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామ‌ని జిల్ల రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి శనివారం తెలిపారు. అభ్య‌ర్థులు త‌మ సందేహాల నివృత్తికి ఈ కంట్రోల్ రూమ్ నంబరు 08922-236947కి సంప్ర‌దించ‌వ‌చ్చున‌ని సూచించారు.