News July 5, 2024

VZM: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..!

image

సాధారణంగా జూన్, జులై నెలల్లో కూరగాయల ధరలు అదుపులోనే ఉంటాయి. ఈ సారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ధరలు అమాంతంగా పెరగడంతో వినియోగదారులు కొనేందుకు బెంబేలెత్తిపోతున్నారు. పచ్చి మిర్చి, అల్లం, టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో అల్లం రూ. 150 పైచిలుకు పలుకుతోంది. దళారుల ప్రవేశంతో సిండికేట్‌గా మారి ధరలు పెంచేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.

Similar News

News July 8, 2024

పార్వతీపురం: ‘నాణ్యమైన ఆహారం అందించాలి’

image

వసతి గృహాల్లో చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక సాయి నగర్ కాలనీలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌గా విధుల్లో చేరిన రోజే ఆశ్రమ పాఠశాల నిర్వహణపై దృష్టి సారించారు. విద్యార్థులకు వండిన వంటకాలను రుచి చూశారు.

News July 8, 2024

పార్వతీపురం: 4వ రోజు 117 మందికి ఈ సెట్ కౌన్సెలింగ్

image

4వ రోజు 117 మందికి ఈసెట్ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎమ్మార్ నగరం పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ విలియం క్యారీ అన్నారు. స్థానిక కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. ఈనెల 10వ తేదీ వరకు వెరిఫికేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు. తొలి నాలుగు రోజులు కలిపి 510 ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

News July 7, 2024

గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

గంట్యాడ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో గంట్యాడకి చెందిన హరీశ్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.