News April 6, 2025
VZM: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

విజయనగరం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4న ఎల్.కోట మండలంలోని ఓ గ్రామంలో ఐదేళ్ల బాలికపై టీవీ చూసేందుకు ఇంటికి వచ్చిన బాలుడు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి 17 ఏళ్ల బాలుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News April 7, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి!

ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి శ్రీరామనవమి రోజున ఒక్కటయ్యారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కుటుంబ సభ్యులు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
News April 7, 2025
KKD: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీ అరెస్ట్

ఐపీఎల్ సీజన్ ప్రారంభమవడంతో హనుమకొండ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను ఆదివారం అరెస్ట్ చేశారు. ఏజెంట్లకు మధ్యవర్తిగా వ్యహరిస్తున్న కాకినాడకు చెందిన క్రికెట్ బుకీ వీరమణికూమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని యోగేశ్ గుప్తా బెట్టింగ్ లాభాల్లో 9% ఇస్తానని చెప్పడంతో పలువురితో బెట్టింగులు కట్టించాడు. కాకినాడలో ఓ ప్లాటు, రెండు మద్యం దుకాణాలు దక్కించుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
News April 7, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంట్రన్స్ టెస్ట్‌లకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే JEE మెయిన్ రెండో సెషన్ పూర్తికావొచ్చింది. TGEAPCET(చివరి తేదీ APR 9), APEAPCET(లాస్ట్ డేట్ APR 24) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వీటితో పాటు బిట్స్, విట్టీ, SRM, సిట్టీ వంటి ప్రైవేటు సంస్థలు దేశవ్యాప్తంగా టెస్ట్స్ నిర్వహిస్తున్నాయి. వీటిపైనా ఓ లుక్కేయండి.