News June 11, 2024

VZM: ఒకే ఫ్రేమ్‌లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు

image

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తొమ్మిదికి తొమ్మిది సీట్లు కైవసం చేసుకుంది. మంగళవారం విజయవాడలోని ఎన్డీఏ శాసనసభ పక్ష నేత ఎన్నిక సభలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఒకే ఫ్రేమ్‌లో ఫొటో దిగారు.

Similar News

News December 14, 2025

కొత్తవలస: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొత్తవలస (M) తుమ్మకాపల్లి ఫైర్ స్టేషన్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లశంకర్రావు (52) మృతి చెందాడు. వేపాడ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గొల్ల దారప్పడు, గొల్ల శంకర్రావు ద్విచక్ర వాహనంపై పిల్లలతో విశాఖ బీచ్‌కు వెళ్తున్నారు. వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో శంకర్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దారప్పడును KGHకి తరలించారు. పిల్లలు భవాని, శంకర్ గాయపడ్డారు.

News December 14, 2025

VZM: రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి 5 ఆలయాల్లో చోరీ

image

వేపాడ మండలం బానాదిలో శనివారం రాత్రి 5 దేవాలయాల్లోని హుండీలో సొమ్మును దొంగలు అపహరించినట్లు SI సుదర్శన్ తెలిపారు. శివాలయం, వినాయకుడు, హనుమాన్, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి సొమ్ము దొంగలించినట్లు వెల్లడించారు. దొంగలించిన సోమ్ము సుమారు రూ.41 వేలు ఉంటుందన్నారు. క్లూస్ టీమ్‌తో తనిఖీలు నిర్వహించారు. అర్చకుడు కిషోర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.

News December 14, 2025

విజయనగరం కలెక్టరేట్‌లో రేపు PGRS: కలెక్టర్

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు PGRS నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు పూర్వపు స్లిప్పులతో రావాలని సూచించారు. అర్జీల కోసం 1100 కాల్ సెంటర్, Meekosam.ap.gov.in సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.