News February 4, 2025
VZM: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
కరెంట్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన పాచిపెంట మండలం కర్రివలసలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకట సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం మండలం గొళ్ళలపేట గ్రామానికి చెందిన కె.రామారావు కర్రివలసలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ లైన్లు తగిలి మృతి చెందాడు. మృతుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News February 4, 2025
సిరిసిల్ల: జిల్లా BJP అధ్యక్షుడు ఎవరో..?
బీజేపీ నూతన అధ్యక్షుల ప్రకటనలో భాగంగా 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. మిగతా 11 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాల్సి ఉంది. రెడ్డి, మున్నూరు కాపులకు 6, 4-గౌడ్స్, వైశ్య, ఎస్సీలకు 2, కమ్మ, ఆర కటిక, పద్మశాలీ, పెరిక, ముదిరాజ్‌లకు 1 చొప్పున BJP అధ్యక్షులను నియమించింది. అయితే ఇప్పటివరకు సిరిసిల్ల అధ్యక్షుడినైతే ప్రకటించలేదు.కాగా జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News February 4, 2025
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వేర్వేరుగా భేటీ
TG: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో బీఆర్ఎస్‌ఎల్పీ, బీజేపీఎల్పీ ఎమ్మెల్యేలు వేర్వేరుగా సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చిస్తున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు 4 శాతం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కులగణన చేసిందని దుయ్యబట్టారు.
News February 4, 2025
MBNR: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.