News September 8, 2025

VZM: కలెక్టరేట్లో నేడు యధావిధిగా PGRS

image

విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం యధావిధిగా PGRS జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చు అన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News September 8, 2025

VZM: కలెక్టర్ కార్యాలయానికి 167 వినతులు

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన PGRSకు 167 వినతులు అందాయి. కలెక్టర్ అంబేడ్కర్, ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 58 వినతులు అందాయన్నారు. పంచాయతీ శాఖకు 12, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 42 వినతులు అందాయన్నారు. వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు.

News September 8, 2025

VZM: రూ.40 లక్షల విలువ చేసే ఎరువులు సీజ్

image

ప్రైవేటుగా అధిక రేట్లకు ఎరువులు అమ్ముతున్నారని వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్, పోలీస్ అధికారులతో ముమ్మర తనిఖీలు జరిపించి, అధిక ధరలను అరికడతామని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆదివారం తన ఛాంబర్లో మాట్లాడుతూ.. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో 411 చోట్ల తనిఖీలు నిర్వహించి, ఒక FIR నమోదు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.40 లక్షలు విలువ గల 172 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులను సీజ్ చేశామన్నారు.

News September 7, 2025

పిడుగుపాటుతో 30 మేకలు మృత్యువాత

image

వేపాడ మండలం కొండగంగుబూడిలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి 30 మేకలు మృతి చెందాయి. వర్షానికి మేకలన్ని చెట్టు దగ్గరికి చేరడంతో పిడుగుపాటుకు గురయ్యాయి. నంది రమేశ్, గలారి పదసాహెబ్, సార ఎర్రయమ్మ సార బుచ్చమ్మకి చెందిన జీవాలు కొండపైన మరణించడంతో జీవనోపాధి కోల్పోయామంటూ వారు వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.