News September 8, 2025

VZM: కలెక్టర్ కార్యాలయానికి 167 వినతులు

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన PGRSకు 167 వినతులు అందాయి. కలెక్టర్ అంబేడ్కర్, ఇతర అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సమస్యలకు సంభందించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 58 వినతులు అందాయన్నారు. పంచాయతీ శాఖకు 12, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 42 వినతులు అందాయన్నారు. వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News September 9, 2025

VZM: జిల్లాలో 5వేల ఎకరాల్లో IT పార్కుల ఏర్పాటు

image

IT పార్కుల స్థాపనకు సుమారు 5వేల ఎకరాల భూమిని సేకరించనున్నట్లు కలెక్టర్ అంబేద్కర్ సోమవారం ప్రకటించారు. త్వరలోనే భూసేకరణ ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే భోగాపురం జాతీయ రహదారికిరువైపులా 200 మీటర్ల పరిధిలో సుమారు 754 ఎకరాలను గుర్తించామన్నారు. వీటిలో 20 ఎకరాలకు పైబడిన స్థలాలను గుర్తించామన్నారు. వీటిలో 100 ఎకరాలు పైబడిన 3 బ్లాకులు ఉన్నాయన్నారు. స్థలాలు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.

News September 9, 2025

సుజల స్రవంతి భూ సేకరణను వేగవంతం చేయండి: కలెక్టర్

image

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు భూ సేకరణపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్.కోట, వేపాడ, కొత్తవలస మండలాల పరిధిలోని 4 గ్రామాల్లో 108 ఎకరాలు, బొండపల్లి మండలంలోని 3 గ్రామాల పరిధిలో 126 ఎకరాల భూసేకరణపై చర్చించారు. ఈ గ్రామాల రైతులతో త్వరలో సమావేశం నిర్వహించి ధర ఖరారు చేయాలన్నారు.

News September 8, 2025

తాలాడలో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

సంతకవిటి మండలం తాలాడ గ్రామంలో బింగి లక్ష్మణరావు (30) ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్ఐ గోపాల్‌రావు సోమవారం తెలిపారు. అతనికి పెళ్లై 2 సంవత్సరాలైందన్నారు. మృతుడి భార్య గౌతమి (గంగమ్మ) ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.