News August 17, 2025

VZM: కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి

image

PGRS అర్జీదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం సూచించారు. తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఆ నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను కూడా సంప్రదించవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News August 17, 2025

విజయనగరం స్పా సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు

image

విజయనగరం పట్టణంలోని పలు స్పా సెంటర్లో శనివారం రాత్రి విజయనగరం వన్ టౌన్ సిఐ ఆర్.వి.ఆర్.కె చౌదరి ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు బయటపడలేదని, స్పా సెంటర్ల నిర్వహణకు తగిన సూచనలు ఇచ్చామన్నారు. స్పా సెంటర్లు కార్యకలాపాలను పూర్తిగా పారదర్శకంగా చట్టబద్ధంగా కొనసాగించాలని సూచించారు. సెంటర్లకు సంబంధించి రికార్డులు, సీసీ ఫుటేజీలను పరిశీలించామన్నారు.

News August 16, 2025

ఈ ఏడాది 13,260 మందిపై కేసులు: VZM SP

image

ఈ ఏడాది ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 13,260 మందిపై కేసులు నమోదు చేశామని SP వకుల్ జిందల్ శనివారం తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామని, దొరికిన వారిపై కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. వివిధ ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెడుతున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

News August 15, 2025

VZM: జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్‌

image

79వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ క‌లెక్ట‌రేట్ వ‌ద్ద శుక్ర‌వారం జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. పోలీసుల‌ నుంచి గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. పిల్ల‌ల‌కు, ఉద్యోగుల‌కు మిఠాయిల‌ను పంచిపెట్టారు. కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేతు మాధ‌వ‌న్, డిఆర్ఓ ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి, క‌లెక్ట‌రేట్ ఏఓ తాడ్డి గోవింద‌, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.