News December 27, 2025

VZM: కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో సి కేటగిరీలో ఉన్న కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అన్ని ఏ ప్లస్ కేటగిరీకి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో కేపీఐలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో 90, మండల స్థాయిలో 82 పారామీటర్లు వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.

Similar News

News December 31, 2025

VZM: ముమ్మరంగా వాహన తనిఖీలు

image

ఇవాళ రాత్రి 7 గంటల నుంచి విజయనగరంలోని 150 ప్రాంతాల్లో సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు ఈ తనిఖీలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

News December 31, 2025

పార్లమెంట్ అటెండెన్స్‌: విజయనగరం ఎంపీకి 99%

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ ఏడాది పార్లమెంట్‌ అటెండెన్స్‌లో 99 శాతం సాధించారు. అన్ని సెషన్‌లలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో CAPF ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు, విజయనగరంలో గానీ విశాఖలో SSB సెంటర్ ఏర్పాటు, జొన్నాడ టోల్ గేట్ రీలొకేట్ తదితర ముఖ్యమైన 11 డిబేట్‌లలో ఆయన చర్చించారు. అదేవిధంగా వివిధ అంశాలపై 127 ప్రశ్నలు సంధించారు.

News December 31, 2025

VZM: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

విశాఖలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన విజయనగరం జిల్లా వ్యక్తికి స్పెషల్ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భోగాపురం ప్రాంతానికి చెందిన నర్సింగ్ విశాఖ వన్‌టౌన్ పరిధిలో ఉంటున్నాడు. ఈ ఏడాది మార్చిలో అదే ప్రాంతంలో ఉంటున్న 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పు నిచ్చింది.