News February 6, 2025

VZM: ‘క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’

image

క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారిణి జీవన రాణి సూచించారు. వైద్య శాఖ కార్యాలయంలో జిల్లాలో పీహెచ్సీ, సీహెచ్సీ వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మాతృ సేవలు, జేఎస్ వై, పీఎం మాతృ సురక్ష అభియాన్, తదితర కార్యక్రమాలపై చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే శత శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News January 28, 2026

VZM: లీగల్ సర్వీసెస్ ఉద్యోగాల దరఖాస్తుల గడువు పెంపు

image

విజయనగరం జిల్లా న్యాయ సేవల అధికార సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.భబిత మంగళవారం తెలిపారు. బ్యాంక్, పబ్లిక్ హాలిడేస్ కారణంగా జనవరి 27 చివరి తేదీని జనవరి 30కి మార్చినట్లు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News January 27, 2026

VZM: ‘పట్టాదారు పాసుపుస్తకాల్లో 50 శాతం తప్పులు’

image

ప్రస్తుతం ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలలో కనీసం 50 శాతం వరకు తప్పులు ఉన్నాయని JC ఎస్.సేధు మాధవన్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సిబ్బంది శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని సరిదిద్దిన తరువాతే ఖచ్చితమైన పాస్ పుస్తకాలు రూపొందించాలని సూచించారు. రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చిన అర్జీలను వారం నుంచి 10రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు.

News January 27, 2026

VZM: రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ఫోకస్

image

రెవెన్యూ, రీ సర్వే సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించడంపై జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి, వారికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. తప్పులు లేని రెవెన్యూ రికార్డులు రూపొందించాలన్నారు.