News November 8, 2024
VZM: గంజాయితో ఆరుగురు యువకులు అరెస్ట్

విజయనగరంలో గంజాయిని చిన్న మొత్తాల్లో విక్రయిస్తున్న ఆరుగురు యువకులను వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు చెందిన యువకులు చెడు వ్యసనాలకు అలవాటుపడ్డారన్నారు. వారి అవసరాలకు ఒడిశా నుంచి గంజాయిని తీసుకొని వచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి, విక్రయిస్తున్నట్లు గుర్తించి దాడులు చేయగా 2 కిలోల గంజాయి లభించిందన్నారు.
Similar News
News February 22, 2026
VZM: ఘనంగా పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు

రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ ఛైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన వారు ఈనెల 25, 26 తేదీల్లో జిల్లాలో జరుగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు.
News February 22, 2026
గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు: VZM SP

గంజాయి విక్రయించినా, రవాణ చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. జిల్లాలో గంజాయి హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ప్రలోభాలకు లోనుకాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు గానీ 1972 నంబరుకు గానీ తెలియజేయాలని కోరారు.