News August 27, 2025

VZM: గణేష్, దేవీ మండపాలకు ఉచిత విద్యుత్

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత ప్రారంభం కానున్న దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆయా విగ్రహాల మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిచనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మమణరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు 3KW, పట్టణాలకు 5KW వరకు ఉచిత లోడ్‌‌ను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు స్థానిక విద్యుత్ సిబ్బందిని సంప్రదిస్తే మంజూరు చేస్తారన్నారు.

Similar News

News August 27, 2025

ఊర్కొండలో 65.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటలలో నాగర్కర్నూల్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఉర్కొండ మండలంలో అత్యధికంగా 65.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. తాడూరులో 64.2, ఉప్పునుంతలలో 59.4, కల్వకుర్తిలో 56.4, వెల్దండలో 50.6, తిమ్మాజీపేటలో 61.8, బిజినేపల్లిలో 49.6, వంగూరులో 45.2, పెద్ద కొత్తపల్లిలో 45.2, తెలకపల్లిలో 43.6, పదరలో 44.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

News August 27, 2025

NZB: GGH మరమ్మతులకు రూ.2.76 కోట్లు

image

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) భవనం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.2.76 కోట్లు మంజూరు చేసినట్లు GGH సూపరింటెండెంట్ డాక్టర్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఈ నిధులతో మరుగుదొడ్లు, డ్రెయినేజీలు, తలుపులు, కిటికీలు, భవనం ముందు భాగంలో మరమ్మతులు చేపట్టడంతోపాటు పాలియేటివ్ కేర్ సెంటర్ అభివృద్ధి, ల్యాబ్ మరమ్మతులు, టీహబ్ విస్తరణ పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

News August 27, 2025

ALERT: HYDలో భారీ వర్షం పడుతోంది!

image

మంగళవారం సాయంత్రి నుంచి నగరవ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, మియాపూర్, హఫీజ్‌పేట, కొండపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, నల్లగండ్ల, హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌ పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి పండగ వేల మార్కెట్లకు వెళ్లే ప్రజలు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.