News August 31, 2025

VZM: గౌరవ వందనం స్వీకరించిన అశోక్ గజపతిరాజు

image

గోవా గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించిన తర్వత పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు.
దీంతో ఆదివారం ఆయన స్వగృహం వద్ద ఎంపీ కలిశెట్టి అప్ప‌ల‌నాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి అశోక్ గజపతిరాజు గౌరవ వందనం స్వీకరించారు.

Similar News

News September 3, 2025

VZM: మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ

image

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ పాఠశాలలో డ్రైవింగ్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా SC కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు డి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. కనీసం ఏడాది కాలపరిమితి గల లైట్ డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్‌తో ఈనెల 5వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News September 3, 2025

అపశృతులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలి: SP

image

విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల నిమర్జన వేడుకల్లో ఎటువంటి అపశృతులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్‌ ఆదేశించారు. నిమజ్జనానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డిజేలను వినియోగించేందుకు అనుమతులు లేవన్నారు.

News September 2, 2025

VZM: ‘పెండింగ్ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయండి’

image

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో NDPS చట్టం ప్రకారం నమోదై, దర్యాప్తులో ఉన్న గంజాయి కేసులను ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం తన కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫెరెన్స్‌లో సమీక్షించారు. పెండింగులో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. పరారీలో ఉన్న నిందితుల సమాచారం సేకరించాలని, వారి ఆచూకీని గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించాలని సూచించారు.