News January 3, 2025
VZM: చిన్నారిపై అత్యాచారం కేసులో 25 ఏళ్ల జైలుశిక్ష
విజయనగరం జిల్లాలో సంచలనం రేపిన చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి 25ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ జిల్లా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చినట్లు DSP శ్రీనివాసరావు చెప్పారు. రామభద్రపురం మండలం నేరేళ్లవలసలో బి.ఎరకన్నదొర గతేడాది ఉయ్యాలలో ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. జైలుశిక్ష పడడంతో ప్రజలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జైలుశిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధించారు.
Similar News
News January 6, 2025
VZM: ‘8న జరగాల్సిన పరీక్ష 11కు వాయిదా’
కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అధికారులు స్వల్ప మార్పు చేశారు. ఈనెల 8న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను 11కి వాయిదా వేసినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఎం.రవి ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు పీఈటీ పరీక్షలు జరిగే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో అభ్యర్థులు గమనించాలని కోరారు.
News January 6, 2025
VZM: NDA కో-ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా నేతలు
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను పురస్కరించుకొని విశాఖలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పలు సూచనలు అందజేశారు.
News January 5, 2025
పెదమానాపురం గేట్ మధ్యలో చిక్కుకున్న వ్యాన్..!
దత్తిరాజేరు మండలం పెదమానాపురం రైల్వే ట్రాక్ మధ్యలో ఆదివారం రాత్రి వ్యాన్ చిక్కుకుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండడం, రైళ్లు ఎక్కువగా వెళ్లడంతో మాటిమాటికీ గేట్ పడుతుంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యేలోపు మళ్ళీ గేట్ వేసే క్రమంలో వ్యాన్ చిక్కుకుంది. దీంతో కాసేపు ఏం జరుగుతుందోనని గందరగోళం నెలకొంది. రైల్వే సిబ్బంది గమనించి ట్రైన్ వచ్చేలోపు గేట్ తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.