News December 15, 2025

VZM: ‘చిన్న పత్రికలకు చేయూత ఇవ్వాలి’

image

చిన్న, మధ్య తరహా పత్రికలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌ రాం సుందర్ రెడ్డికి విలేకరుల బృందం సోమవారం వినతిపత్రం ఇచ్చారు. అక్రిడిటేషన్ సంఖ్య పెంపునకు ఇతర జిల్లాల నుంచి ప్రచురితమవుతున్న విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న విలేకరులకు అక్రిడిటేషన్ మంజూరు చేయాలన్నారు. క్యాలెండర్ ప్రకటనల ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే అంశాలను వినతిలో ప్రస్తావించారు.

Similar News

News December 17, 2025

VZM: 20 నుంచి ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాలు

image

ఈనెల 20 నుంచి జనవరి 19 వరకు ఆర్టీసీ కార్గో సేవల్లో డోర్ డెలివరీ మాసోత్సవాలను నిర్వహిస్తామని విజయనగరం జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. నగరాల్లో 10 కి.మీ పరిధిలో 50 కేజీల వరకు పార్శిల్స్ డోర్ డెలివరీ చేస్తామన్నారు. తక్కువ ధరతో వేగంగా, సురక్షితంగా మీ ఇంటి వద్దకు అందిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు.

News December 16, 2025

బొబ్బిలి: మార్మాంగం కోసుకున్న మతిస్థిమితం లేని యువకుడు

image

బొబ్బిలి పట్టణంలోని మతిస్థిమితం లేని యువకుడు మార్మాంగం కోసేసుకున్నాడు. విశాఖపట్నం రెల్లి వీధి ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు సోమవారం బొబ్బిలిలో రక్తంతో రోడ్లుపై తిరుగుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్సకు యువకుడు సహకరించకపోవడంతో వైద్యులు బలవంతంగా వైద్యం చేసి విజయనగరం రిఫర్ చేయగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం KGHకి తరలించారు.

News December 16, 2025

VZM: ప్రభుత్వ వైద్యశాలలో ఉద్యోగాల ఎంపిక జాబితా విడుదల

image

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రి పరిధిలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాలు విడుదలయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డా.సరోజినీ దేవి మంగళవారం తెలిపారు. 20 కేటగిరీల్లో 91 పోస్టులకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టులు, షార్ట్‌లిస్టెడ్ క్యాండిడేట్స్ జాబితాలు, స్పీకింగ్ ఆర్డర్లు ఆన్‌లైన్‌లో పొందుపరిచామన్నారు. జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 16, 17 తేదీల్లో తెలియజేయాలన్నారు.