News October 12, 2024

VZM: చివరి నిమిషంలో పరుగులు తీసిన ప్రయాణికులు

image

కొత్తవలస రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దసరా నేపథ్యంలో స్పెషల్ ట్రైన్లు వేసిన సంగతి తెలిసిందే. విశాఖ నుంచి అరకు వెళ్లాల్సిన ప్రత్యేక రైలుకు మచిలీపట్నం టూ విశాఖ బోర్డు ఉండడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎక్కాల్సిన ట్రైన్ కాదనుకొని వేచి చూస్తుండగా ప్లాట్ ఫామ్‌పై వ్యాపారాలు చేస్తున్న వారు అరకు రైలు అని చెప్పడంతో ట్రైన్ ఎక్కేందుకు పరుగులు తీశారు.

Similar News

News October 12, 2024

పార్వతీపురంలో రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి

image

రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ బాలాజీ తెలిపిన వివరాలు ప్రకారం.. పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న జీ మల్లేశ్వరరావు (37) పట్టణ సమీపంలో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

News October 12, 2024

పైడిమాంబ ఉత్సవాలకు బొత్సకు ఆహ్వానం

image

ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం శ్రీ పైడిమాంబ ఉత్సవాలకు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు ఆలయ అధికారులు ఆహ్వానం పలికారు. పట్టణంలోని బొత్స నివాసానికి వెళ్లి ఉత్సవాలకు సంబంధించి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, ఈఓ ప్రసాదరావు పాల్గొన్నారు.

News October 12, 2024

విజయనగరం: ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన

image

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలతో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేయించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఎం.ఎస్.ఎం.ఈ పార్కు ఏర్పాటుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని విజయనగరం రూరల్ మండలం గోపాలపురం వద్ద అందుబాటులో ఉన్న 15 ఎకరాల స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. దీంతో జిల్లాలో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.