News January 6, 2025
VZM: జాతీయ పోటీలకు 5 గురు జిల్లా క్రీడాకారులు
జనవరి 8 నుంచి 12 వరకు ఉత్తరాఖండ్‌లో జరగబోయే 50 వ జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి 5 గురు క్రీడాకారులు ఎంపికయ్యారని కబడ్డీ సంఘం ఛైర్మన్ ఐవీపీ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాల, బాలికల విభాగంలో ఎం.రాంబాబు,సి హెచ్. మురళీ, పి.నందిని, వి.సూర్యకల, ఎం. పావని ఎంపికయ్యారన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీంకు ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Similar News
News January 8, 2025
విశాఖ నుంచి సంక్రాంతి స్పెషల్ బస్సులు
విశాఖ నుంచి సంక్రాంతి ప్రత్యేక బస్సులను ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి నడపనున్నట్లు ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు తెలిపారు. ద్వారక బస్ స్టేషన్, మద్దిలపాలెం, గాజువాక, సింహాచలం డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. ఈ మేరకు రెండువందల బస్సులను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌ను బట్టి రాత్రి వేళల్లో కూడా బస్సులు నడిపే ఆలోచన ఉందన్నారు.
News January 8, 2025
ప్రధాని సభకు ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు బుధవారం సాయంత్రం విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. జన సమీకరణలో భాగంగా విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి 70, ఎస్.కోట డిపో నుంచి 30 చొప్పున..మొత్తం 100బస్సులతో జనాలను తరలించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఆర్టీసి డిపోల నుంచి మొత్తం 80 బస్సులను ప్రధాని సభకు వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
News January 8, 2025
పార్వతీపురం: ‘వడ్డీలేని పంట రుణాలపై అవగాహన కల్పించాలి’
వచ్చే ఖరీఫ్ సీజన్‌కు రైతులకు లక్షలోపు వడ్డీ లేని పంట రుణాలు అందించనున్నందున పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బ్యాంక్ అధికారులు, పలు శాఖల అధికారులతో డీసీసీ అండ్ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు.