News March 7, 2025
VZM: జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కేనో..?

మార్చిలోగా నామినేటెడ్ పదవుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రధానంగా ఎస్.కోట నుంచి గొంప కృష్ణ, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. జనసేన, బీజేపీలో కూడా ఆశావహులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
Similar News
News March 9, 2025
VZM: విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. స్థానిక కోర్టులో శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజీయే రాజమార్గం నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా చేసామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్‌కు సంబంధించి రూ. 70 లక్షల చెక్కును పంపిణీ చేశామన్నారు.
News March 8, 2025
విజయనగరంలో 3వేల మంది మహిళలతో ర్యాలీ: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజీవ్ క్రీడా ప్రాంగణంలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనిత హాజరుకానున్నారని వెల్లడించారు. 3వేల మంది మహిళలతో ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 7, 2025
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 21 లోక్ అదాలత్ బెంచీలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి శుక్రవారం తెలిపారు. రెండు జిల్లాల్లో మొత్తం 21 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద బీమా, బ్యాంకు చెక్ బౌన్స్, ప్రాంసరీ, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్, ల్యాండ్, తదితర కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.