News December 10, 2025

VZM: ‘జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి’

image

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం విజయనగరం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. కేంద్రీయ గిరిజన వర్శిటీ, భోగాపురం విమానాశ్రయం, తోటపల్లి, తారకరామ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, కుర్ధారోడ్-విజయనగరం మూడో రైల్వే లైన్, కొత్తవలస-విజయనగరం నాలుగో రైల్వే లైన్ భూ సేకరణ స్థితిపై సమీక్షించారు.

Similar News

News February 11, 2026

బడ్జెట్ సమావేశాలకు విజయనగరం ఎమ్మెల్యేలు

image

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీకు చేరుకున్నారు. జిల్లాలోని సాగునీరు, తాగునీటి సమస్యలతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు, హామీల అమలు, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు, నిరుద్యోగుల సమస్యలపై ప్రజాప్రతినిధులు గళమెత్తాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

News February 11, 2026

రైతులకు మార్కెట్ భరోసా కల్పించాలి: VZM కలెక్టర్

image

రైతులకు మార్కెట్ సదుపాయం ఉందన్న భరోసా కల్పించినప్పుడే ఉద్యానమిషన్ విజయవంతం అవుతుందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యాన మిషన్‌ పై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సాయంత్రం సమీక్షించారు. జిల్లాలో ఈ ఏడాది పదివేల ఎకరాల్లో అదనంగా ఉద్యాన పంటలను సాగు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా రబీలో ఇప్పటికే అదనంగా సుమారు 3,300 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు జరిగిందన్నారు.

News February 11, 2026

VZM: ‘జిల్లాలో బోద వ్యాధిని పూర్తిగా నిరోధించాలి’

image

జిల్లాలో బోద వ్యాధిని సమూలంగా నిరోధించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి జె.పి.నడ్డా తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా కలెక్టర్‌తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గుర్ల మండలం బోద వ్యాధి లేని మండలంగా ఎంపిక చేసి ఈనెల 10 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక కాంపెయిన్ నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. డీ.ఈ.సీ, ఆల్బెండజోల్‌ మాత్రలు ఇంటిటికీ పంపిణీ చేయాలని కోరారు.