News January 6, 2026
VZM: జిల్లాలో రైస్ మిల్లర్లపై మంత్రి నాదేండ్ల ఆగ్రహం

జిల్లాలోని రైస్ మిల్లర్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన బొండపల్లిలోని లక్ష్మీనారాయణ మోడరన్ రైస్ మిల్లును మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లర్ల అసోసియేషన్ నాయకులతో సమావేశమయ్యారు. ధాన్యాన్ని మర పట్టి ప్రభుత్వానికి అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. CMR విషయంలో ఎందుకు వెనుకబడ్డారని నిలదీశారు.
Similar News
News February 1, 2026
VZM: ఆప్యాయంగా పలకరించుకున్న బొత్స, పతివాడ

మండలి విపక్ష నేత బొత్స సత్యన్నారాయణ, టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు ఆదివారం పూసపాటిరేగలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. బొత్స భుజంపై పతివాడ చేయి వేసి స్నేహపూర్వకంగా పలకరించారు. కాసేపు సరదాగా ముచ్చటించుకుంటూ పరస్పర ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. రాష్ట్రమంతా రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన జిల్లాలో మాత్రం రాజకీయాలు హుందాగా సాగుతున్నాయి.
News February 1, 2026
విజయనగరం: సీఎం పర్యటనకు స్థల పరిశీలన

విజయనగరం జిల్లాలోని రేగిడి ఆమదాలవలస మండలం వన్నలిలో ఈ నెల 9న సీఎం చంద్రబాబు రానున్నారని సమాచారంతో ప్రత్యేక డిప్యుటీ కలెక్టర్ ప్రమీలగాంధీ శనివారం గ్రామాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ గ్రామంలో రీసర్వే బాగుండడంతో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారన్నారు. తహశీల్దార్ కృష్ణలత పాల్గొన్నారు.
News February 1, 2026
విజయనగరం: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో పురుగులమందు ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడలో చోటు చేసుకుంది. ఎన్.లక్ష్మణరావు నిత్యం మద్యం తాగడంతో భార్య రామలక్ష్మి గతనెల 30న మండలించారు. దీంతో పురుగులమందు తాగడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ కొండలరావు తెలిపారు.


