News May 4, 2024

VZM: జిల్లాలో 18,631 పోస్టల్ బ్యాలెట్లు

image

జిల్లాలో 18,631 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పేర్కొన్నారు. బొబ్బిలి నియోజక వర్గంలో 2105 మంది , చీపురుపల్లి‌లో 1405 మంది, గజపతినగరం లో 1665 మంది, నెల్లిమర్ల లో 1525 మంది , విజయనగరంలో 3975 మంది, శృంగవరపుకోట (అసెంబ్లీ)లో 1776, రాజాంలో 1741 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News February 12, 2026

VZM: తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు

image

శివ‌రాత్రికి రామ‌తీర్థం, పుణ్య‌గిరి, ధ‌ర్మ‌వ‌రం, సంగ‌మేశ్వ‌ర స్వామి ఆల‌యం, పాల్తేరు, కోటిప‌ల్లి, త‌దిత‌ర శివాల‌యాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఉచిత‌ బ‌స్సు ప‌థ‌కం వ‌ల్ల‌ మ‌హిళ‌లు గ‌తం కంటే ఎక్కువగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. తొక్కిస‌లాట జ‌ర‌గ‌కుండా అన్నిర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ప్ర‌వేట్ ఆల‌యాలకు సంబంధించి ఆల‌య క‌మిటీల‌ను అప్ర‌మ‌త్తం చేయాలన్నారు.

News February 12, 2026

VZM: ఆసుపత్రి ముంగిటే మృతి

image

విజయనగరం మహారాజ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆసుపత్రి క్యాజువాలిటీ వద్ద సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు అచేతనంగా పడిఉన్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తమ వైద్య సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని లోపలికి తీసుకువెళ్లి చికిత్స అందించారని అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు సూపరింటెండెంట్ డా.పద్మజ తెలిపారు.

News February 12, 2026

బాడంగి: ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి

image

బాడంగి మండలం రావివలస గ్రామానికి చెందిన అప్పలస్వామి (70) మంగళవారం ఉత్తరవల్లిలో బంధువులు ఇంటికి వెళ్లాడు. అప్పలస్వామి వెళ్లి రోజు గడిచినా ఇంటికి రాకపోవడంతో కుమారుడు ఆచూకీ కోసం వెతకగా ఊరు సమీప చెరువులో మృతదేహం కనిపించింది. చెరువులో ఉన్న డెడ్ బాడీ తన తండ్రిదేనని కుమారుడు గుర్తించాడు. ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసుకు బుధవారం ఫిర్యాదు చేశాడు. హెచ్‌సీ ప్రసాదరావు కేసు నమోదు చేశారు.