News December 11, 2025
VZM: జిల్లా గ్రంథలయ సంస్థ ఛైర్మన్‌గా రామకృష్ణ

విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా టీడీపీ నేత డొక్కాడ రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గానికి చెందిన రామకృష్ణ గతంలో ఏఎంసీ ఛైర్మన్‌గా ఆయన భార్య మంగమ్మ గుమ్మలక్ష్మిపురం జడ్పీటీసీగా పనిచేశారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 19, 2025
పోలవరం పెండింగ్ అనుమతులివ్వండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల శక్తి మంత్రి CR పాటిల్‌ను CM చంద్రబాబు కోరారు. ఇవాళ ఢిల్లీలో పాటిల్‌తో గంటపాటు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ అనుమతులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలని చూస్తోందని, భూసేకరణకు సిద్ధమైందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.
News December 19, 2025
జంట పేలుళ్ల దోషుల శిక్ష రద్దు పిటిషన్‌పై HC విచారణ

TG: లుంబినీ పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల దోషులకు HC ఇద్దరు మిటిగేటర్లను నియమించింది. ఆరోగ్య, మానసిక స్థితి, పశ్చాత్తాప భావనను పరిగణించి మరణశిక్ష రద్దు చేయాలని నేరస్థులు పిటిషన్ వేశారు. తమ విచారణను మరో బెంచ్‌కు మార్చాలని కోరారు. దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. 2007లో HYD జంట పేలుళ్లతో 46మంది చనిపోయారు. ఈ కేసులో MHకు చెందిన అనిక్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్‌లకు 2018లో ఉరిశిక్ష పడింది.
News December 19, 2025
సైబర్ గిఫ్ట్ లింకులతో జాగ్రత్త: ఎస్పీ సునీల్ షొరాణ్

క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్‌ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రజలను హెచ్చరించారు. ఇలాంటి లింకులు, ఏపీకే (APK) ఫైల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.


