News April 14, 2024

VZM: టీడీపీ రెబల్‌గా మీసాల గీత పోటీ..!

image

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తెలిపారు. ఆదివారం విజయనగరంలో ఆమె మాట్లాడుతూ.. అందరి ఆత్మ గౌరవం అనే నినాదంతో వెళ్తున్నట్లు చెప్పారు. పదవుల కోసం చూడకుండా పార్టీ మనుగడ కోసం పని చేస్తే 2O24లో కూడా తనకు అన్యాయం చేశారన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం అన్ని అవమానాలు భరించానన్నారు.

Similar News

News September 30, 2024

VZM: యువతకు ఎస్పీ కీలక సూచనలు

image

ప్రస్తుతం గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతూ, చట్టాలను కూడా కఠినతరం చేశామన్న విషయాన్ని యువత గమనించాలని విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గంజాయి అక్రమ రవాణా కేసులో పట్టుబడితే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడుతుందన్నారు. గంజాయి కేసుల్లో ఎక్కువగా యువత పట్టుబడుతూ.. జైల్లో మగ్గుతున్నారని ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.

News September 30, 2024

విజయనగరం: TODAY TOP NEWS

image

⁍VZM: దసరా సెలవులు ఆరు రోజులే
⁍పార్వతీపురం దిశ సెల్ ఎస్ఐలు వీరే
⁍బొబ్బిలిలో కొండచిలువ హతం
⁍విజయనగరం జిల్లాలో ఎక్సైజ్ సీఐలకు బదిలీలు
⁍విజయనగరం జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రాలివే
⁍పైడితల్లమ్మ సిరిమాను చెట్టుకు పూజలు
⁍రేపు బొబ్బిలి రానున్న సినీ నటుడు సాయికుమార్
⁍కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్
⁍నిండుకుండలా తాటిపూడి జలాశయం
⁍రామతీర్థంలో రామచంద్ర ప్రభువుకు పట్టు పవిత్రాల సమర్పణ

News September 29, 2024

కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

కురుపాం మండలం వలసబల్లేరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని నీలకంఠపురం SI తెలిపారు. ఘటనలో బిడ్డిక జూజారు, బిడ్డిక శ్రీను మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.