News November 7, 2024
VZM: టూరిజం హోటల్స్ ఏర్పాటుపై IHCL బృందం పరిశీలన
విజయనగరం జిల్లాలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా సంస్థకు చెందిన IHCL ఆసక్తి కనబరుస్తోంది. ఈ సంస్థ ప్రతినిధుల బృందం జిల్లాలో గురువారం పర్యటించి పలు ప్రాంతాల్లో పర్యాటక హోటల్స్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసింది. అనంతరం కలెక్టర్ అంబేడ్కర్‌ను కలెక్టరేట్లో కలిసి జిల్లాలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు.
Similar News
News November 22, 2024
ఇక నుంచి స్థానికంగా ప్రజా పరిష్కార వినతుల స్వీకరణ: JC
ఇకపై ప్రతి సోమవారం మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లో ప్రజా వినతుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని JC సేతు మాధవన్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎంపీడీవో, తహసిల్దార్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ తదితరులతో కూడిన మండల స్థాయి సమన్వయ కమిటీ నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
News November 21, 2024
VZM: రామతీర్థం అభివృద్ధికి ప్రతిపాదనలు ఇవే..
జిల్లాలో ఉన్న రామతీర్థం దేవస్థానాన్ని తీర్థయాత్ర పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఇటీవల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రామతీర్థంలో మ్యూజియం, కేఫ్ టేరియా, వ్యూ పాయింట్లు, రోప్‌వే నిర్మాణం, లైటింగ్, బౌద్ధ ప్రదేశాల వద్ద వసతులు, కోనేరు రహదారి విస్తరణ వంటి పనులకు అధికారులు త్వరలో ప్రతిపాదనలు తయారు చేయనున్నారు.
News November 21, 2024
భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు ప్రతిపాదన
జిల్లాలో ఏర్పాటవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును పెడుతున్నట్లు ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా అల్లూరి సేవలను గుర్తు చేసుకున్నారు.