News July 28, 2024
VZM: ట్రిపుల్ ఐటీ విద్యార్థి సూసైడ్

కర్నూలు పరిధి జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కుదమకి చెందిన ఎన్.సాయికార్తీక్ నాయుడు(20) ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలోని హాస్టల్‌లోని 9వ అంతస్తు పైనుంచి దూకాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సివుంది. కాగా.. విద్యార్థి జేబులో సూసైడ్ నోట్ ఉన్నట్లు సమాచారం.
Similar News
News September 30, 2025
హోంమంత్రి అనితతో పైడితల్లమ్మ దేవస్థాన ఈఓ భేటీ

జిల్లా ఇన్‌ఛార్జ్ మినిస్టర్, హోం మంత్రి వంగలపూడి అనితను విజయనగరం శ్రీపైడితల్లి దేవస్థానం ఈవో, సహాయ కమిషనర్ శిరీష విశాఖలోని హోం మంత్రి ఆఫీసులో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 7న జరగనున్న ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీపైడితల్లమ్మ సినిమానోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఉత్సవ ఏర్పాట్లను అనితకు వివరించారు.
News September 30, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి సమీక్ష

సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం రాత్రి దత్తి గ్రామంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన దాదాపు రోజంతా గ్రామంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, JC సేధు మాధవన్ పాల్గొన్నారు.
News September 29, 2025
VZM: పాల ప్యాకెట్ ధర తగ్గిందా?

ఇటీవల సవరించిన జీఎస్టి రేట్లతో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని పలు డెయిరీ యాజమాన్యాలు ప్రకటించాయి. విశాఖ డెయిరీలో మొత్తం 188 ఉత్పత్తుల్లో 94 ఉత్పత్తుల గరిష్ఠ పాల ఉత్పత్తుల <<17788908>>ధరలు తగ్గనున్నాయని<<>> తెలిపింది. పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గనుందని వెల్లడించింది. పనీర్ కేజీ ప్యాకెట్ ధర రూ.20, నెయ్యి కేజీకి రూ.42 వరకు తగ్గుతాయని చెప్పింది. మరి క్షేత్రస్థాయిలో రేట్లు తగ్గాయా కామెంట్ చెయ్యండి.