News November 30, 2025
VZM: దేశమంటే మట్టి కాదోయ్..!

దేశమంటే మట్టి కాదోయ్.. అంటూ జాతీయ భావజాలాన్ని నింపిన మహాకవి గురజాడ. కన్యాశుల్కం వంటి నాటకంతో సామాజిక సంస్కరణలకు ఆయన దిక్సూచి. విద్యావేత్త, సమాజ శిల్పి అయిన గురజాడ సేవలను నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజలు స్మరించుకుంటున్నారు. గురజాడ వెంకట అప్పారావు 1862 సెప్టెంబర్ 21న ఎస్.రాయవరంలో జన్మించారు. ఆయన తండ్రి ఉద్యోగ నిమిత్తం విజయనగరం జిల్లాకు వలస వచ్చారు.
Similar News
News December 4, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు HYD వ్యాప్తంగా ఫ్రీ బస్సులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌కు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకునేందుకు MGBS, JBS, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఉ.9 నుంచి మ.1 వరకు, తిరిగి వచ్చేందుకు సా.4 నుంచి రాత్రి 9 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
News December 4, 2025
ఏడాదిలో సరికొత్త టోల్ వ్యవస్థ: గడ్కరీ

ప్రస్తుతం ఉన్న టోల్ వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. దాని స్థానంలో ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల టోల్ పేరుతో NHలపై ఎక్కడా ఆగకుండా ప్రయాణించవచ్చన్నారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో అమలవుతోన్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లతో 4,500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని లోక్‌సభలో తెలిపారు.
News December 4, 2025
మునగాల: జీపీలో జాబ్ రిజైన్.. సర్పంచ్‌గా పోటీ

మునగాల మండలం వెంకట్రామపురం గ్రామ పంచాయతీ ఉద్యోగి మంద ముత్తయ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వెంకట్రామపురం ఎస్సీ జనరల్ స్థానం కావడంతో, పోటీ చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు రాజీనామాను ఆమోదించడంతో, ఆయన ప్రచారం ప్రారంభించారు. అధికార పార్టీ ముత్తయ్యకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.


