News December 29, 2024

VZM: నకిలీ ఐపీఎస్ ఉన్నత విద్యావంతుడే..!

image

నకిలీ IPS సూర్య ప్రకాష్ ఉన్నత చదువులే చదివాడు. స్థానికంగా బీటెక్ పూర్తి చేసిన ఈయన కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో MBA చేశాడు. 2003లో ఇండియన్ ఆర్మీలో సిపాయిగా ఎంపికయ్యాడు. 2005లో ఉద్యోగం విడిచిపెట్టి 2016 వరకు కాంట్రాక్ట్ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. కాగా పవన్ పర్యటనలో IPS అంటూ తిరుగుతూ దిగిన ఫొటోలను వాట్సప్ స్టేటస్‌ పెట్టుకోగా ఎంక్వైరీలో అసలు విషయం బయట పడిందని పోలీసులు తెలిపారు.

Similar News

News December 29, 2024

నూర్పిడి యంత్రం బోల్తా.. బాలుడి మృతి

image

బొబ్బిలి మండలంలోని మహారాణితోట సమీపంలో ఉన్న పొలంలో నూర్పిడి యంత్రం బోల్తాపడి సాలపు మణికంఠ(14) మృతి చెందారు. బాలుడు తల్లిదండ్రులు శంకర్, పొలమ్మ నూర్పిడి కూలీ పనికి వెళ్లగా తల్లిదండ్రులతో ఇద్దరు కుమారులు వెళ్లారు. నూర్పిడి అయిపోవడంతో యంత్రంపైకి ఎక్కవద్దని తల్లిదండ్రులు చెప్పినప్పటికి వినకుండా మణికంఠ, తమ్ముడు పార్థు, మరో అబ్బాయి ఎక్కారు. బోల్తా పడడంతో ఇద్దరు దూరంగా తుల్లగా మణికంఠ కిందపడి మరణించాడు.

News December 29, 2024

VZM: ‘కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సర్వం సిద్ధం’

image

జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు PMT, PET పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని రకాలైన ఏర్పాట్లును పూర్తి చేసినట్లుగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నియామకాల ప్రక్రియలో భాగంగా జిల్లాలో 9,152 మంది అభ్యర్థులకు రేపటి నుంచి జనవరి 22 వరకు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సీసీ కెమోరాల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు.

News December 29, 2024

VZM: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

image

ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. అయితే ఈ కుంభమేళాకు ఉమ్మడి విజయనగరం జిల్లా మీదుగా రెండు రైళ్లు నడవనున్నాయి. తిరుపతి-బనారస్-తిరుపతి (కుంభమేళా), నరసాపూర్-బనారస్-నరసాపూర్ (కుంభమేళా) స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.