News December 22, 2025

VZM: నాన్నమ్మను హత్య చేసిన మనవడు

image

భోగాపురం మండలం ముడసలపేట గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. నాన్నమ్మను హత్య చేసిన మనవడు ముడసల గౌరి (27)ను అరెస్టు చేసినట్లు SP దామోదర్ సోమవారం తెలిపారు.మద్యం మత్తులో నిందితుడు నాన్నమ్మ అప్పయ్యమ్మను హత్య చేసి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడి వద్ద నుంచి 18.250 గ్రాముల బంగారు వస్తువులు, 106 గ్రాముల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Similar News

News December 24, 2025

తిరుమలకు ఫేక్ టికెట్లతో వస్తున్నారా..?

image

తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో SP సుబ్బరాయుడు కీలక ప్రకటన చేశారు. ‘డిసెంబర్ 30, 31, జనవరి 1న లక్కీడిప్ టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తాం. అన్ని టోకెన్లను స్కాన్ చేసి అందులోని టైం ప్రకారమే పంపుతాం. నకిలీ టోకెన్లు సృష్టించిన వారిపై, వాటిని తిరుమలకు తీసుకొచ్చిన భక్తులపైనా కేసులు నమోదు చేస్తాం. ఆటో, జీపు డ్రైవర్లు భక్తులను మిస్ గైడ్ చేస్తే చర్యలు ఉంటాయి’ అని SP హెచ్చరించారు.

మొదటి ప్లమ్ కేక్ స్టోరీ: మంబల్లి బాపు మ్యాజిక్!

image

మన దేశంలో మొదటి ప్లమ్ కేక్ 1883లో కేరళలోని తలస్సేరిలో తయారైంది. మంబల్లి బాపు అనే బేకరీ యజమాని దీన్ని తయారు చేశారు. అప్పటి బ్రిటిష్ ఆఫీసర్ ఇంగ్లండ్ నుంచి తెచ్చిన కేక్ తిని దాన్ని మన దేశీ స్టైల్‌లో రీక్రియేట్ చేశారు. విదేశీ బ్రాందీకి బదులు స్థానిక జీడిమామిడి పండ్ల సారా, అరటిపండ్లు వాడి అద్భుతమైన రుచిని తెచ్చారు. ఇప్పటికీ అదే పాత పద్ధతిలో కట్టెల పొయ్యి మీద ఈ కేకులను తయారు చేస్తున్నారు.