News March 25, 2025
VZM: నేడు,రేపు APPSC పరీక్షలు

నేడు, రేపు జరగనున్న APPSC పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన DRO ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. 25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, 25, 26 తేదీల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని అనలిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలకు, 26న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News March 26, 2025
VZM: భౌతికశాస్త్రం పరీక్షకు 119 మంది విద్యార్థులు గైర్హాజరు

విజయనగరం జిల్లాలో 119 పరీక్షా కేంద్రాలలో జరిగిన 10 వతరగతి పరీక్షలలో బుధవారం జరిగిన భౌతిక శాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి యు. మాణిక్యంనాయుడు తెలిపారు. ఈ పరీక్షలు 119 పరీక్ష కేంద్రాలలో రెగ్యులర్ విద్యార్థులు 22,919మంది హాజరు కావాల్సి ఉండగా 22,919 మంది హజరు కాగా 119 మంది గైర్హాజరు అయ్యారన్నారు.
News March 26, 2025
‘విజయనగరం జిల్లాలో రూ.194 కోట్లు చెల్లించాం’

విజయనగరం జిల్లాలో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 91,836 మంది రోగులు వైద్య సేవలు పొందారని జిల్లా మేనేజర్ రాంబాబు తెలిపారు. జిల్లాలో 66 ప్రభుత్వ ఆసుపత్రులు, 25 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలో మొత్తం రూ.194 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రూ.20లక్షల వరకు ప్యాకేజీ పెంచినట్లు వెల్లడించారు.
News March 26, 2025
గొల్లాదిలో కొట్లాట.. ఏడుగురుకి గాయాలు

బాడంగి మండలం గొల్లాది పోలమ్మ ఆలయం సమీపంలో కామన్నవలస, గొల్లాది గ్రామానికి చెందిన వారి మధ్య మంగళవారం కొట్లాట జరిగినట్లు ఎస్ఐ తారకేశ్వరరావు చెప్పారు. ఆలయం సమీపంలో గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు మేకలు మేపుతుండగా కామన్నవలసకి చెందిన ఆదినారాయణ మేకలు మేపేందుకు వచ్చాడు. వారి మధ్య కొట్లాట జరగడంతో ఇరువర్గాలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.