News June 25, 2024

VZM: నేడు జిల్లాకు కొత్త కలెక్టర్

image

విజయనగరం జిల్లా కలెక్ట‌ర్‌గా నియమితులైన బీ.ఆర్.అంబేడ్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం జిల్లాకు చేరుకుంటారు. కలెక్టరే‌ట్‌లో మధ్యాహ్నం ప్రస్తుత కలెక్టర్ నాగ లక్ష్మి ఆయనకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ అవుతారని తెలియజేశారు.

Similar News

News June 29, 2024

VZM: పదేళ్లు 4వేల మందికి పాముకాటు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో పాముకాటుతో ఎక్కవ మంది మృతి చెందుతున్నారు. వర్షాలు పడుతుండడంతో రైతులు, వ్యవసాయ కూలీలంతా పొలం పనులకు వెళ్తూ అక్కడ పాముకాటుకు గురౌతున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే నెల వరకు 4,447 పాముకాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో సుమారు 30% మృతిచెందారు. ప్రథమ చికిత్సపై అవగాహన లేకపోవడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధాన కారణాలు. జిల్లా ఆస్పత్రులలో వారానికి ఆరు పాముకాటు కేసులు నమోదౌతున్నాయి.

News June 29, 2024

విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

image

జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బి.సాయి క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తిని, జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.ఆర్.అంబేద్క‌ర్ శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. జిల్లా న్యాయస్థానంలోని ఆయన ఛాంబర్‌లో కలిసి, పూలగుచ్ఛాన్ని అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం కొద్దిసేపు జిల్లాకు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు. ఆర్‌డిఓ ఎం.వి.సూర్య‌క‌ళ కూడా తదితర సిబ్బంది పాల్గొన్నారు.

News June 29, 2024

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: ఆర్జేడీ

image

ఉపాధ్యాయులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆర్జేడీ విజయ భాస్కర్ అన్నారు. పార్వతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బడి బయట పిల్లలు బడికి వచ్చే చర్యలు చేపట్టాలని అందుకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయుల సమయపాలన ఎంఈఓ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అలసత్వం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.