News October 11, 2025
VZM: నేపాల్‌లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లా ప్లేయర్స్

ఇండో-నేపాల్ యూత్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్-2025 (YSEFI)లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. నేపాల్ దేశంలోని పోఖ్రాన్‌లో ఈనెల 7 నుంచి 10వరకు జరిగిన ఈవెంట్‌లో ఇండియా తరుఫున రన్నింగ్(సీనియర్ విభాగం)లో స్వర్ణపతకాలు సాధించారు. పార్వతీపురం మండలం డి.మూలగకు చెందిన యాళ్ల ఈశ్వరరావు(800మీ), గజపతినగరం మండలం భూదేవిపేటకు చెందిన ఇప్పర్తి సూర్యతేజ (400మీ) ఈ ఘనత సాధించారు.
Similar News
News October 11, 2025
డీప్ ఫేక్ వీడియోలతో మోసం: దేవినేని

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోషల్ మీడియాలో ఏఐ వీడియో ద్వారా జరుగుతున్న మోసాలపై
X వేదికగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది సైబర్ నేరగాళ్లు పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫేక్ ఆడియో వీడియో కాల్స్ చేస్తున్నారన్నారు. ఏఐ సహాయంతో డీప్ ఫేక్ వీడియోలతో మోసం చేస్తున్నారని చెప్పారు. సైబర్ మోసాలపై విజయవాడ పోలీస్ కమిషనర్ తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 11, 2025
పల్నాడులో నేర నియంత్రణకు ఎస్పీ ఆదేశాలు

నరసరావుపేట పోలీస్ కార్యాలయంలో సెప్టెంబర్ నెల నేర సమీక్షా సమావేశం ఎస్పీ బి.కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. పోలీస్ సేవలు సమర్థవంతంగా అందించేందుకు ప్రతి రోజు కాల్స్, వారానికోసారి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. మహిళా భద్రత, శక్తి కాల్స్, డ్రోన్ గస్తీ, రాత్రి గస్తీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
News October 11, 2025
విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు

AP: విజయవాడ, సింగపూర్ మధ్య నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని వారాల్లో) సర్వీసులు ఉంటాయని వివరించారు. విజయవాడ నుంచి సింగపూర్ ఛాంగీ విమానాశ్రయానికి ఈ సర్వీసులు ఉంటాయని చెప్పారు. భవిష్యత్తులో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.