News March 13, 2025

VZM: పదో తరగతి పరీక్షలకు 2,248 మంది ఇన్విజిలేటర్లు

image

విజయనగరం జిల్లాలో ఈనెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 119 సెంటర్లలో 23,765 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. రెండు విడతలగా 2,248 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు.

Similar News

News March 13, 2025

VZM: 15,226 మంది లబ్ధిదారులకు గుడ్ న్యూస్

image

నిర్మాణం మ‌ధ్య‌లో నిలిచిపోయిన ఇళ్ల‌ను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అద‌న‌పు ఆర్ధిక స‌హాయంతో జిల్లాలో 15,226 మంది ల‌బ్ధిదారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరనుంది. 12,240 మంది బీసీలకు, 2,231 మంది ఎస్సీలకు ఒక్కో ఇంటికి రూ.50 వేలు, 565 మంది షెడ్యూల్డు తెగ‌ల వారికి రూ.75 వేలు, 190 మంది ఆదిమ‌ తెగ‌లకు రూ.లక్ష చొప్పున సహాయం అందనుంది.

News March 13, 2025

VZM: డీసీహెచ్ఎస్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పరిధిలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని డీసీహెచ్ఎస్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తులను జిల్లా సర్వజన ఆసుపత్రిలోని కార్యాలయానికి అందజేయాలన్నారు. పూర్తి వివరాలు https://www.ap.gov.in వెబ్‌సైట్‌‌లో కలవు.

News March 13, 2025

విజయనగరం జిల్లాలో హైవేపై 64 సీసీ కెమెరాలు: కలెక్టర్ 

image

జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారణకు 64 సీసీ కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అంబేడ్క‌ర్ చెప్పారు. తన ఛాంబర్లో బుధవారం హిట్ అండ్ రన్ జిల్లా పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 34కి.మీ. రోడ్డుపై 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులు లేకుండా చేసేందుకు సీసీ కెమెరాల అమర్చే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులు లేకుండా చూడాలన్నారు.

error: Content is protected !!