News December 24, 2024

VZM: పవన్ కళ్యాణ్ అభిమాని ఇంట్లో విషాదం`

image

కొత్తవలస మండలం రామలింగాపురంలో <<14964633>>బ్రైన్ ట్యామర్‌<<>>తో అఖిర్ నందన్(6) చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ బాలుడి తండ్రి అప్పలరాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. దీంతో పవన్ కళ్యాణ్ కుమారుడి పేరు కలిసేలా అఖిర్ నందన్ అని తన కుమారిడికి పేరు పెట్టుకుని మురిసిపోయాడు. కానీ విధి ఆడిన వింతనాటకంలో చిన్న వయస్సులో తన కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Similar News

News December 25, 2024

యువతిని మోసం చేసిన వ్యక్తికి రిమాండ్: సీఐ

image

ఎస్.కోట మండలం రాజీపేటకి చెందిన వాడుబోయిన ఎర్రినాయుడు (19) పై పోక్సో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసగించాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేశామని సీఐ మూర్తి తెలిపారు. అతడిని కాపు సోంపురం వద్ద మంగళవారం అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం విజయనగరం డీఎస్పీ వద్దకు తీసుకెళ్ళగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. 

News December 25, 2024

విజయనగరం: మహిళ అనుమానాస్పద మృతి

image

విజయనగరం – కోరుకొండ రైల్వే స్టేషన్ మధ్యలో సారిక సమీపంలో పట్టాలు పక్కన గుర్తు తెలియని మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. రైల్వే ఎస్ఐ బాలాజీరావు వివరాలు మేరకు.. వయసు 25-30 ఏళ్ల మధ్యలో, ఐదు అడుగులున్న ఎత్తు ఉంటుంది. ఆమె వివరాలను గుర్తించిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని కోరారు. 

News December 25, 2024

గంజాయి రవాణా పై కఠినంగా వ్యవహారించాలి: VZM SP

image

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షను ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. గంజాయి రవాణ నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలని, రవాణకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తూనే, వారికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని గుర్తించాలన్నారు.