News August 8, 2025
VZM: పారపని చేస్తుండగా పిడుగు పడి మృతి

విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. జామి మండలం అట్టాడ గ్రామంలో పిడుగు పడి సత్యనారాయణ (60) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామ సమీపంలోని పార పని చేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యాడని చెప్పారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
Similar News
News August 31, 2025
VZM: నేడు జిల్లాకి రానున్న గోవా గవర్నర్

గవర్నర్ హోదాలో పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారి జిల్లాకు రానున్నారు. మూడు రోజులు పాటు జిల్లాలో ఉంటారు. సెప్టెంబర్ 1న శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటారు. 2వ తేదిన కోటలోని మోతీమహల్‌ను ప్రారంభిస్తారు. 3వ తేదిన సింహాచలం శ్రీవరహాలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, 4న గోవాకు తిరుగు పయనమవుతారని అశోక్ బంగ్లా వర్గాలు వెల్లడించాయి.
News August 30, 2025
VZM: సుస్థిర గిరిజనాభివృద్దికి MOU

విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ మధ్య శనివారం MOU కుదిరింది. ఇరు సంస్థల ప్రతినిధులు శ్రీనివాసన్, సుందరం సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ సాగు, ఆధునిక వరి సాగు, వ్యాధుల నియంత్రణపై శిక్షణకు MOU దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. సుస్థిర గిరిజనాభివృద్దికి MOU కుదిరిందన్నారు.
News August 30, 2025
VZM: కానిస్టేబుళ్ల వైద్య పరీక్షల షెడ్యూల్ ఇదే

కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షల షెడ్యూల్‌ను ఎస్పీ విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ నంబర్ల ప్రకారం హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
> సెప్టెంబర్1న రిజిస్ట్రేషన్ నెంబర్ 4013323 TO 4175360, 4177478-4232439
> 2న 4234215-4347353, 4350301-4495111, 4001630-4044049
> 3న 4044111-4130825, 4132116-4189468
> 4న 4190909-4235398, 4235403-4269223
> 6న 4270844-4330310, 4330524-4511514