News August 19, 2025

VZM: పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లను తక్షణమే చెల్లించాలి

image

మోటారు వాహనాల చట్ట ఉల్లంఘనలకు సంబధించి పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లను వారం రోజులలోగా చెల్లించాలని ఉప రవాణా కమిషనర్ మణికుమార్ తెలిపారు. https://echallan.parivahan.gov.in/index/accused-challan#challan_list వెబ్సైట్ ద్వారా చెల్లించాలని సూచించారు. ఈ-చలాన్లను చెల్లించని పక్షంలో చట్ట ప్రకారం వారి వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు.

Similar News

News August 23, 2025

డీఎస్సీ ఫలితాలు.. ఆరు ఉద్యోగాలు సాధించిన ప్రసాద్

image

వంగర మండలం మరువాడ గ్రామానికి చెందిన గుంట ప్రసాద్ శుక్రవారం వెలువడిన DSC ఫలితాలలో ఎస్‌సిబి కేటగిరిలో ఆరు ఉద్యోగాలు సాధించారు. SA ఫిజిక్స్, SA మ్యాథ్స్, PGT ఫిజికల్ సైన్స్, TGT మ్యాథ్స్ జోన్1, TGT ఫిజిక్స్ జోన్1, TGT సైన్స్ జోన్1లలో ఉత్తీర్ణత సాధించారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ తనను చదివించారని ప్రసాద్ తెలిపారు. ఇష్టమైన ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరుతానన్నారు.

News August 23, 2025

VZM: ఎరువుల కొరత.. కలెక్టర్ కీలక ఆదేశాలు

image

మండల స్థాయిలో MRO, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సివిల్ స‌ప్ల‌యిస్‌ డిప్యూటీ తహశీల్దార్ల‌తో ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేస్తామని విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం ప్రకటించారు. దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, RSKలను త‌నిఖీ చేయిస్తామ‌న్నారు. షాపుల‌కు స‌ర‌ఫ‌రా అయిన ఎరువులు, పంపిణీ, నిల్వ‌ల‌పై వారం రోజుల్లో త‌మ‌కు నివేదిక‌ను అంద‌జేయాల‌ని ఆదేశించారు. పక్కదారి పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News August 23, 2025

VZM: స్కానింగ్ సెంట‌ర్ల‌ను త‌నిఖీ చేయండి

image

విజయనగరం జిల్లాలోని స్కానింగ్ సెంట‌ర్ల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి, నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో పిసిపిఎన్‌డిటి చ‌ట్టం అమ‌లుపై త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో శుక్ర‌వారం సమావేశాన్ని నిర్వ‌హించారు. జిల్లాలోని స్కానింగ్ సెంట‌ర్ల రెన్యువ‌ల్‌, కొత్త వాటికి అనుమ‌తుల‌పై చ‌ర్చించారు. అనుమ‌తి లేకుండా స్కానింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌కూడ‌ద‌న్నారు.