News December 31, 2025
VZM: పెన్షన్‌దారులకు అలెర్ట్

రాష్ట్ర ప్రభుత్వ, కుటుంబ పెన్షన్‌దారులు 2026 సంవత్సరానికి లైఫ్ సర్టిఫికేట్‌ను జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపు తప్పనిసరిగా సమర్పించాలని విజయనగరం జిల్లా ఖజానా అధికారి నాగమహేశ్ మంగళవారం తెలిపారు. జిల్లా ట్రజరీ, సబ్ ట్రజరీ కార్యాలయాల్లో జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు ఏర్పాట్లు చేశామన్నారు. 2025 నవంబర్, డిసెంబర్‌లో సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్లు చెల్లవన్నారు.
Similar News
News December 31, 2025
కుమ్మపల్లిలో యాక్సిడెంట్..ఓ వ్యక్తి స్పాట్ డెడ్

వేపాడ మండలం కుమ్మపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. దేవరాపల్లి మండలం ముత్యాలమ్మ పాలెంకు చెందిన చౌడువాడ దేవుడు నాయుడు బుధవారం తన స్నేహితుడు మహేష్‌తో కలసి బైక్‌పై కుమ్మపల్లి వెళుతుండగా రోడ్డు మలుపులో బైక్ అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో గాయపడిన చౌడు నాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 31, 2025
VZM: ముమ్మరంగా వాహన తనిఖీలు

ఇవాళ రాత్రి 7 గంటల నుంచి విజయనగరంలోని 150 ప్రాంతాల్లో సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు ఈ తనిఖీలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
News December 31, 2025
పార్లమెంట్ అటెండెన్స్: విజయనగరం ఎంపీకి 99%

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ ఏడాది పార్లమెంట్ అటెండెన్స్‌లో 99 శాతం సాధించారు. అన్ని సెషన్‌లలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో CAPF ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు, విజయనగరంలో గానీ విశాఖలో SSB సెంటర్ ఏర్పాటు, జొన్నాడ టోల్ గేట్ రీలొకేట్ తదితర ముఖ్యమైన 11 డిబేట్‌లలో ఆయన చర్చించారు. అదేవిధంగా వివిధ అంశాలపై 127 ప్రశ్నలు సంధించారు.


