News February 28, 2025
VZM: పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు

విజయనగరంలో ఓ యువకుడు పెళ్లి ఇష్టం లేదని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. CI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. నెయ్యిల వీధికి చెందిన పి.సాయికి మార్చిలో వివాహం జరగాల్సి ఉంది. కాగా ఈనెల 24 ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అనంతరం తల్లికి ఫోన్ చేసి పెళ్లి ఇష్టం లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. యువకుడి కోసం ఎంత గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ CI కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 28, 2025
నల్లబెల్లి: సోలార్ బ్యాటరీ దొంగలను అరెస్టు చేసిన ఎస్ఐ

నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో వివిధ గ్రామాల్లో సోలార్ లైట్‌కు సంబంధించిన 10 బ్యాటరీలను దొంగిలించి ఆటోలో వేసుకొని ములుగులో అమ్ముకునేందుకు వెళ్తుండగా నల్లబెల్లి పోలీస్ సిబ్బందితో పట్టుకున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. నిందితులను జ్యూడిషియల్ రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News February 28, 2025
ఆది పినిశెట్టి ‘శబ్దం’ మూవీ రివ్యూ

ఆది పినిశెట్టి, లక్ష్మీ మేనన్ ప్రధాన పాత్రల్లో అరివళగన్(వైశాలి ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘శబ్దం’. ఓ కాలేజీలో వరుస ఆత్మహత్యల కేసును హీరో ఛేదించే క్రమంలో ఎదురయ్యే పరిణామాలేంటనేదే ఈ సినిమా స్టోరీ. సిమ్రాన్, లైలా పాత్రలు ఆశ్చర్యపరుస్తాయి. ఆది నటన, తమన్ BGM, ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లస్. సెకండాఫ్ గజిబిజిగా ఉండటం, వీక్ క్లైమాక్స్, VFX మైనస్.
RATING: 2.5/5
News February 28, 2025
చెంచుల సంక్షేమానికి తోడ్పాటు: నంద్యాల కలెక్టర్

చెంచు గిరిజనులు తమ జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలంలోని బైర్లూటి చెంచుగూడెం పరిధిలో నన్నారి మొక్కల సాగుపై వారితో మాట్లాడారు. చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, శ్రీశైలం ఐటీడీఏ పీవో శివప్రసాద్ ఉన్నారు.